నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు AP పోలీస్ “యువశక్తి” స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుపుతుంది. కంప్యూటర్, డ్రైవింగ్, సెక్యూరిటీ గార్డ్, హోటల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ లో ఉచిత శిక్షణ ఇస్తారు. పోలీస్ శిక్షణా కేంద్రాల్లో నిపుణులతో క్లాసులు, ప్రాక్టికల్ ట్రైనింగ్, సర్టిఫికెట్ అందిస్తారు.
ప్రైవేట్ కంపెనీలతో టై-అప్ చేసి జాబ్ మేళాలు పెడతారు. క్రీడలు, ఫిట్‌నెస్ ద్వారా డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పెంచుతారు. ఇప్పటికే 5000+ మంది యువత ఉపాధి పొందారు. దరఖాస్తు కోసం దగ్గరి PS లేదా DPO కార్యాలయం సంప్రదించండి.








