స్కూల్ బుక్ స్టాల్‌ వద్ద USFI, PDSU, DSFI ఆందోళన|

0
0

మహబూబాబాద్:: డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బుక్ స్టాల్‌కు వ్యతిరేకంగా USFI, PDSU, DSFI విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యం పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టైలు, బెల్టులు, హాస్టల్ సామగ్రిని బలవంతంగా విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని ఆరోపించారు. ప్రైమరీ వండర్ కిడ్స్ పాఠశాలను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న బ్రిలియంట్ స్కూల్ గుర్తింపును రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. DEO, MEOలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.