“మురుగు, వేలాడే విద్యుత్ తీగలు, నీటి నిల్వపై స్థానికులతో సమీక్ష”
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి యాదగిరితో కలిసి సాయినగర్‌లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మురుగు కాలువల దిగ్బంధం, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మల తొలగింపు, నీటి నిల్వ సమస్యలు, కమ్యూనిటీ హాల్ మరమ్మతుల అవసరాన్ని స్థానికులతో కలిసి చర్చించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు అనిల్, సుజాత, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal









