ఆసిఫాబాద్:గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే లక్ష్యంగా ఆసిఫాబాద్ మండలం సాలేగూడ గ్రామ పంచాయతీలో స్థానిక నాయకత్వం కదిలింది. గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ వందన, ఉప సర్పంచ్ సునీత ప్రత్యేక చొరవ తీసుకున్నారు.గ్రామస్తుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, మురికినీటి పారుదల కోసం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కాంపౌండ్ వాల్ నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఈ మేరకు గ్రామానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీబీ నేత విశ్వప్రసాద్‌లను కలిసి గ్రామ సమస్యలపై సమగ్రమైన అభ్యర్థన పత్రాన్ని అందజేశారు. స్థానిక ప్రతినిధులు కోరిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే, ఈ అంశాలను ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.






