మహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం – పౌర సరఫరాలు సంస్థ, శాఖ ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం ‘మిషన్ K-100’ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాలలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి రావలిసిన మొత్తం సుమారు 90 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి ఏడూ కోట్ల రూపాయలను వసూలు చేసిందని దీనిలో భాగంగా శనివారం కురవి మండలం అయ్యగారిపల్లి శ్రీ తిరుమల రైస్ ఇండస్ట్రీస్, మహబూబాబాద్ మండలం అనంతారం గ్రామంలోని శ్రీనివాస ఇండస్ట్రీస్, రైస్ మిల్లులను తనిఖీ చేసి వారు చెల్లించాల్సిన పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు (18.27 in Cr).లకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలు అధికారి జే రమేష్, జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ వి నరసింహ రావు, కురవి మండల ఎం.ఆర్.ఓ అధికారి విజయ, మహబూబాబాద్ మండల రెవిన్యూ అధికారి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.










