“రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన”
మేడ్చల్ మల్కాజ్ గిరి, జూలై 4: రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటికీ జరుగుతున్న ఫారాల పంపిణీ తీరును పర్యవేక్షించి, ప్రక్రియ సక్రమంగా జరిగేలా అవసరమైన సూచనలు చేశారు.
ప్రతి అర్హులైన ఓటరుకు ఫారాలు అందేలా బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
#Sidhumaroju
Alwal










