చినరాయుని చెరువులో నీటి కలుపు తొలగింపు.|

0
12

“ఆలస్యానికి తావు లేకుండా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం”

మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని  ఆల్వాల్  చినరాయుని  చెరువులో కొనసాగుతున్న హైసింత్ (నీటి కలుపు) తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి, కాలనీ సభ్యులతో కలిసి చెరువును సందర్శించిన ఆమె పనుల పురోగతిని పరిశీలించారు.

హైసింత్  (నీటి కలుపు) తొలగింపు పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నాణ్యతతో పనులు పూర్తి చేసి చెరువు పరిశుభ్రతను పరిరక్షించాలని ఆమె పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal