ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరు|

0
1

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో ప్రాథమిక ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. కూనవరం మండలం కొత్త కార్మన్ కొండ, గిరిజన గూడెం కి చెందిన సమ్మక్క ప్రియ అనే బాలిక పాము కాటుకి గురైంది వారి గిరిజన గూడెం కి రోడ్డు మార్గం లేక ఆంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను వారి కుటుంబ సభ్యులు నాలుగు కొండలు డోలితో దాటించి కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. గతంలో ఈ కొండ కొండ రెడ్లకు కొండ కింద ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం జీవన వసతి కల్పించడం జరిగింది. అయినప్పటికీ ఈ గిరిజన కొండ రెడ్లు వారి జీవన సౌలభ్యం, జీవనాధారం పోడు వ్యవసాయం కారణంగా మరల కొండపైకి వెళ్లడం జరిగింది. కావున ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఆంబులెన్స్ ఇతర వైద్య సిబ్బంది వెళ్లే వెసులుబాటు లేదు కావున ప్రభుత్వం వారికి వైద్య సిబ్బందిని కేటాయించి వారి ఆరోగ్యానికి పాటుపడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

 

# Yadagiri