“ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన.
బాలసదన్ భవనం పరిశీలన పూర్తి… త్వరలో సేవలు అందుబాటులోకి”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 10: అల్వాల్‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్, ఎమ్మెల్యేతో కలిసి అల్వాల్‌లోని సఖి సెంటర్ సమీపంలోని బాలసదన్ భవనాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి త్వరలోనే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అదేవిధంగా కౌకూర్‌లో 2BHK గృహాల నిర్మాణం, అల్వాల్‌లో భూదాన్ భూమిలో ఇళ్ల నిర్మాణం, అలాగే కొన్ని ULC భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించి పెండింగ్ రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.
అల్వాల్‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభమైతే స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
#Sidhumaroju
Alwal










