మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి గారు గౌరవ కడప mla మాధవి రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే గారు స్పందిస్తూ, ఈ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ప్రాసెస్‌లో ఉందని, త్వరలోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, మాచుపల్లి బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలకు ఈ రెండు సౌకర్యాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని నాగముని రెడ్డి గారు తెలిపారు.










