జనసేన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్|

0
1

విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక సూచనలు చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, వీర మహిళల సాధక బాధకాలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని కోరారు. కేంద్ర కార్యాలయం నిర్దేశించిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని, ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని క్షేత్రస్థాయి పరిశీలనల అనుభవాలను పంచుకున్నారు.