“భక్తులసౌకర్యమే లక్ష్యం..
సమన్వయంతో ఏర్పాట్లు”
సికింద్రాబాద్, జూలై 10: లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు.
ఈ మేరకు విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఉత్సవాలు, రంగం కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూ లైన్లతో పాటు మొత్తం నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
జాతర విజయవంతానికి ప్రజలు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju










