ఓటు హక్కు పరిరక్షణకు క్షేత్రస్థాయిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్లో స్వయంగా SIR ఫారమ్ నింపిన ఎంపీ|

0
4

బెల్లంపల్లి : ప్రజాస్వామ్యానికి ఓటే బలం, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్‌లో నిర్వహిస్తున్న SIR సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను తెలుసుకుని, తన స్వహస్తాలతో SIR ఫారమ్‌లను నింపుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది. ఒక్క అర్హుడి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా, ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు.అనంతరం సమీపంలోని **ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను సందర్శించిన ఎంపీ, అక్కడ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో నివారణ చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచిస్తూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజల మధ్యే ఉంటూ వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేసిన ఎంపీ వంశీకృష్ణ, SIR ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, న్యాయబద్ధంగా సాగాలని అధికారులను కోరారు.