Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ముగిసింది.|

0
2

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్.ఐ బాలసుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది కూడా పాల్గొని ఓటరు జాబితా పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి చివరి రోజు కావడంతో అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా వెరిఫై చేసుకుని సంబంధిత పత్రాలను అధికారులకు అందించాలని సూచించారు.

 

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.