ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన “ప్రజా దర్బార్ – ప్రజల సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రతి అర్జీదారుడి సమస్యను ఓర్పుతో విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రతి సమస్యకు న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని అర్జీదారులకు భరోసా కల్పించారు.










