“అంతర్‌రాష్ట్ర దోపిడీ కేసు ఛేదన.. అల్వాల్ పోలీసులకు సీపీ రివార్డులు”.|

0
11

“డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వీరబాబు బృందాన్ని అభినందించిన సీపీ బి. సుమతి”

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 16: అంతర్‌రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో దోపిడీ కేసును విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన అల్వాల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్‌కు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ రివార్డులు అందజేసినట్లు అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ తెలిపారు.

క్రైమ్ నెం. 559/2026లో నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్.కె వీరబాబు, సబ్‌ఇన్‌స్పెక్టర్, చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ ఎం. జీవన్ కుమార్, పోలీస్ కానిస్టేబుళ్లు రమాకాంత్, గౌస్ పాషాలను సీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు.

ఈ గుర్తింపు పోలీసు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, భవిష్యత్తులో కూడా ప్రజల భద్రత కోసం ఇదే నిబద్ధతతో పనిచేస్తామని ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal