విభిన్న ప్రతిభావంతులకు ఎన్డీఏ అండ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి|

0
0

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి విభిన్న ప్రతిభావంతులకు మోటార్ స్కూటర్లు, వీల్‌చైర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,750 వాహనాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, స్వయం ఉపాధి రుణాలు, గృహ నిర్మాణ సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తుంటే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే స్ఫూర్తి కలుగుతోందని గళ్ళా మాధవి స్పష్టం చేశారు.