చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్: రూ. 25 వేల సాయం|

0
1

Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న భరోసా’ పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని వారు తెలిపారు.

 

గతంలో అందించిన మొత్తానికి అదనంగా రూ.1,000 పెంచి రూ.25 వేలుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

 

అదేవిధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు (పవర్‌లూమ్‌లకు) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ఈ చర్యలతో ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.