హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం (జూలై 18) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9:30 గంటలకు హుజూర్‌నగర్ అడ్డరోడ్డులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం టౌన్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ జెడ్పీటీసీ, హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు డా. కొప్పుల సైదిరెడ్డి పిలుపునిచ్చారు.
రక్తదానం మహాదానమని, ఈ సేవా కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు.










