హుజూర్‌నగర్ రూరల్ / భారత్ అవాజ్ :
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును రక్షించుకునేందుకు తప్పనిసరిగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి అందజేయాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.
హుజూర్ నగర్ 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 70 శాతం SIR ఫారాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా వెంటనే SIR ఫారాన్ని నింపి స్థానిక BLOకు అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఆకుల రాము, యువ న్యాయవాది చిట్టిపోతుల రమేష్, BLO ఆకుల రజని, RP పులి సుధాలు 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా SIR ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని వారు కోరారు.










