రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన పట్ల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ గారు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, సాత్విక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, “చిన్న వయసులోనే సాత్విక్ వంటి విద్యార్థిని కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటాం. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.










