“బండి-ఈటల విభేదాలకు ముగింపు”.|

0
11

– కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం

– అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు

– పార్టీ కోసమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్‌కు ఎట్టకేలకు తెరపడింది.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ‘ఏక్ హై’ అంటూ ఐక్యత చాటారు.

ఇకపై వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ కలిసి పనిచేయాలని ఇరువురు నిర్ణయించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పరిణామం కీలకంగా మారనుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

#Sidhumaroju