– ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు.
– అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు.
– దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన.
హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు సంస్థాగత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
భారత పౌరసత్వం కలిగిన ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు.
ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి వారి వివరాలను నమోదు చేయించి ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో పాతబస్తీతో పాటు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ దొంగ ఓట్లను చేర్చేందుకు ప్రయత్నిస్తోందని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా, పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేలా చూడాల్సిన బాధ్యత భాజపా శ్రేణులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
#Sidhumaroju










