అన్నమయ్య జిల్లా చిన్నమండెం:
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా… మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలోని తన సొంత నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామాభివృద్ధి సంబంధిత సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని ఓర్పుగా ఆలకించిన మంత్రి గారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గారు పేర్కొన్నారు.










