Madanapalle: అంగల్లు వద్ద IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు ప్రారంభం. స్మార్ట్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్ నమూనాల ప్రదర్శన.|

0
3

Madanapalle: ఆధునిక వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సోదరుడు జయదేవ్ రెడ్డి, మదనపల్లె వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రత్యక్షంగా పరిచయం చేయనున్నారు.

 

లైవ్‌స్టాక్ & డెయిరీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అగ్రి ఇన్నోవేషన్ & స్మార్ట్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్, ఆర్గానిక్ పంటల సాగు వంటి వినూత్న వ్యవసాయ నమూనాలను ప్రదర్శించనున్నారు. రైతులు, పశుసంవర్ధకదారులు, వ్యవసాయ భాగస్వాములు, విద్యార్థులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ హెడ్ ఆఫీస్, అంగల్లు–కొత్తపల్లె, విశ్వం కాలేజ్ సమీపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.