రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌పై ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ ధర్నా|

0
89

పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తూ కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ధర్నా, శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.