యువతపై దాడులను తీవ్రంగా ఖండించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ|

0
3

దేశ యువతపై జరిగిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ దాడులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను అణచివేయడం మోడీ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. మోడీ అంటే ‘మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా’ (M-O-D-I) అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేపర్ లీక్, ఇథనాల్ కుంభకోణం, రామాలయ నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం కోరినా ప్రభుత్వం సభను వాయిదా వేస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. యువత గళాన్ని నొక్కేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, యువత పోరాటానికి తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.