కూటమి విజయాలను ఇంటింటికీ చేరవేయాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి|

0
0

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను జూలై 27 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న పనులను ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించాలన్నారు. కూటమి సుపరిపాలన శాశ్వతంగా కొనసాగాలంటే కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని, రోజుకు కనీసం 30 ఇళ్లను సందర్శించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని, పనిచేయని వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే మాధవి హెచ్చరించారు.