మార్కాపురం పోలీసుల ‘మీ కోసం’: 60 ఫిర్యాదులు స్వీకరణ|

0
0

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్‌ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో సోమవారం ‘మీ కోసం’ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 60 ఫిర్యాదులు అందాయి. వచ్చిన విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి, నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా సత్వరమే పరిష్కరించాలని ఓఎస్డీ అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రధానంగా సివిల్, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, ఉద్యోగాల పేరిట మోసాలు, అత్తింటి వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, సీఐలు అల్తాఫ్ హుస్సేన్, అస్సన్, ఎస్ఐ శివ బసవరాజు తదితరులు పాల్గొన్నారు.