జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!|

0
1

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. ఆలయంలో నేడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.