Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్ (చిన్న)ను మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. వీడియో కాల్లో యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సమీమ్ అస్లాం, ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.
మెరుగైన వైద్యం పొందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా, అంగళ్లు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో యుగంధర్‌కు రెండు కాళ్లు విరిగినట్లు వైద్యులు నిర్ధారించగా, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










