బొబ్బిలి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించండి: కమిషనర్|

0
0

బొబ్బిలి పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు. మహారాణిపేట, గొల్లవీధి, బైపాస్ రోడ్డు ప్రాంతాలలో మంగళవారం పర్యటించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా ఆక్రమణలు తొలగించాలన్నారు. పట్టణంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని, కాలువలలో పూడికలు తీయాలన్నారు.