అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4 స్ఫూర్తితో కనిగిరి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి, ఈరోజు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించాను.
కనిగిరి ప్రజలకు ఆధునిక, పారదర్శకమైన ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
ప్రజల అవసరాలే నా ప్రాధాన్యం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ కనిగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తాను.










