గిరిజన మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ ఆర్థిక భరోసా|

0
1

ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం కోసం పోలవరం జిల్లా కేంద్రం అయిన రంపచోడవరం లో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈ పర్యటన కార్యక్రమంలో ఎటాపాక మండలం, గొమ్ముకొత్తగూడెం కు చెందిన గ్రామస్థులు టీవల చేపల వేటకు వెళ్లి 5 మంది గిరిజనులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన ఊకె సుశీల, తుర్రం భారతీ, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్, ఊకె లక్ష్మీ కుటుంబ సభ్యులతో నారా లోకేశ్ ముచ్చటిస్తూ మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున అందజేసినట్లు తెలిపారు వారితో అల్పాహారం స్వీకరించి కొంత సమయం వారితో గడిపారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా వున్నట్లు కుటుంబాలకు తెలిపారు.

 

# Yadagiri