🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: బాబాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న గారి అధ్యక్షతన, వార్డు మెంబర్ల సమక్షంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు గ్రామ ప్రజలు, పెద్దలు మరియు యువకులు అత్యధిక సంఖ్యలో హాజరై, గ్రామాభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, గ్రామానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన (SIR) ప్రక్రియను వందకు వంద శాతం (100%) సంపూర్ణంగా పూర్తి చేసి, రికార్డు స్థాయి లక్ష్యాన్ని విజయవంతంగా సాధించినట్లు ప్రకటించారు. ఈ 100% లక్ష్య సాధనకు ముఖ్య కారకులైన బీఎల్ఓ (BLO) శ్రీమతి వనిత-వసంతరావు గారిని సర్పంచ్ రాజన్న గారు, వార్డు మెంబర్లు మరియు పంచాయతీరాజ్ సెక్రటరీ గారు శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ విజయంలో భాగస్వాములైన అధికారులకు, సహకరించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.










