ఆగస్టు 28 నుంచి 30 వరకు నెల్లూరులో జరగనున్న డీవైఎఫ్ఐ (DYFI) ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభల ప్రచార కరపత్రాలను ఎమ్మిగనూరు పట్టణ సీఐ కంబగిరి రాముడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటీకరణతో శాశ్వత ఉద్యోగాలు తగ్గి యువత ఉపాధి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు.
ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి కోసం డీవైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పోరాడుతోందని గుర్తుచేశారు. అలాగే గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్‌లకు వ్యతిరేకంగా యువతను చైతన్యపరుస్తూ.. రక్తదాన శిబిరాలు, శ్రమదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. భగత్‌సింగ్, అంబేద్కర్ ఆశయాలతో నెల్లూరులో నిర్వహించే ఈ మహాసభలను ప్రజలు, యువత తమ వంతు సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.










