నీటి కొరతతో ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు

0
1

 భారత్ అవాజ్ న్యూస్ :కదిరి వర్షాలు సకాలంలో కురవకపోవడం, భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో కదిరి ప్రాంతంలో బోర్ల నీటి లభ్యత తగ్గింది. దీంతో పంటలకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. టమోటా, వేరుశనగ, కూరగాయలు తదితర పంటలు పూత, కాయ దశలో ఉండటంతో నీటి కొరత వల్ల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. నీటి కోసం అదనపు ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

పంటలను రక్షించేందుకు నీటిని పొదుపుగా వినియోగించాలని, డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల సంరక్షణకు వర్షపు నీటిని నిల్వ చేయడం, ఫార్మ్‌ పాండ్లను సంరక్షించడం వంటి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.