ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు-కుయిగూరు జాతీయ రహదారి 30 మధ్య ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ – ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు వరుసగా ముడో రోజు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. స్తంభించిన రాకపోకలు AP-ఒడిశా సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలదిగ్బంధంలో గ్రామాలు చింతూరు, వి.ఆర్.పురం మండలాల్లోని పలు గ్రామాలు వరద నీటితో దిగ్బంధమయ్యాయి. పెరుగుతున్న నీటిమట్టం చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం ప్రమాదకరంగా 38 అడుగులకు చేరుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు మంచినీరు, నిత్యావసర వస్తువుల సరఫరా నిరంతరాయంగా అందేలా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
# Yadagiri










