చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, సదుం మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులును అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి .










