చింతూరు ఆసుపత్రిలో అంబులెన్స్ లేక గిరిజన బాలిక మృతి|

0
1

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక లాస్య (4) అనే గిరిజన బాలిక ప్రాణాలు కోల్పోయింది. పెద్ద సీతనపల్లికి చెందిన ఈ చిన్నారికి మలేరియా సోకడంతో చింతూరు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే, అంబులెన్స్ లేకపోవడం, ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకునే స్తోమత ఆ పేద తల్లిదండ్రులకు లేకపోవడంతో బాలిక కన్నుమూసింది.

ఈ దారుణ ఘటనపై బీజేపీ జిల్లా కార్యదర్శి డీవీఎస్ రమణారెడ్డి ఆధ్వర్యంలో గిరిజనులు ఐటీడీఏ కార్యాలయం ఎదుట బాలిక మృతదేహంతో ఆందోళన చేపట్టారు. చిన్నారి మృతిపై సమగ్ర విచారణ జరపాలని, ఆసుపత్రిలో 24 గంటలు అంబులెన్స్ ఉండేలా చూడాలని, దానికి డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్‌కు పరిస్థితిని వివరించి ఫిర్యాదు చేశారు.

 

# Yadagiri