ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై నందవరం మండల అధికార ప్రతినిధి బోయ వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నందవరం మండల యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, గ్రామ యూత్ అధ్యక్షులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.










