మదనపల్లె, ఆగస్టు 8: గత నెలలో గాయపడిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు యుగంధర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని ఇరువురు నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు ధైర్యం చెప్పి, త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీనియర్ రిపోర్టర్ యుగంధర్ త్వరగా కోలుకుని తిరిగి తన విధుల్లో చురుగ్గా పాల్గొనాలని గంగారపు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు ఆకాంక్షించారు. ఈ పరామర్శ సందర్భంగా యాలగిరి దొరస్వామి నాయుడు, ఖాన్ తదితరులు కూడా యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు.










