మంచిర్యాల జిల్లా : నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట సాగునీటి లభ్యతపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు,ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీటిని విడుదల పై చర్చించడం జరిగిందని అన్నారు,వారి ఆదేశానుసారం రైతుల విజ్ఞప్తి మేరకు రేపు కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన రైతులు పంటల సాగు చేపట్టాలని అన్నారు. రైతులు పండించే ప్రతి ఎకరాకు సాగునీటి అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులు దృష్టి పెట్టాలని కోరారు,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించేందుకు అవసరమైన చేయను సమన్వయంతో చేపట్టాలని అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి సంబంధిత అధికారులు, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు,










