పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ!|

0
1

 

పైలట్ కావాలనుకునే ఆంధ్రప్రదేశ్ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏవియేషన్ రంగంలో కీలక అడుగులు వేస్తూ, రాష్ట్రంలో కొత్తగా ఆరు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌టీవో) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కర్నూలు, కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో డీజీసీఏ అనుమతితో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 40 మందికి శిక్షణ ఇస్తారు. ఏపీఏడీసీఎల్ ఆధ్వర్యంలోని కర్నూలు విమానాశ్రయంలో ఈ నెల 22న మొదటి కేంద్రం, డిసెంబర్‌లో రెండో కేంద్రం ప్రారంభం కానున్నాయి. ఏఏఐ పరిధిలోని రాజమహేంద్రవరంలో రెండు కేంద్రాలకు టెండర్లు పూర్తి కాగా, ఆరు నెలల్లో ప్రారంభమవుతాయి. కడపలో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. నాగార్జున సాగర్, తిరుపతిలలో కూడా భవిష్యత్తులో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.