చింతూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లతో భర్తీ చేయనున్నారు. మొత్తం 16 ఖాళీలు ఉండగా, జడ్పీహెచ్ఎస్ చింతూరులో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)-1, మరియు నరసింగపేట, దొంగల జగ్గారం, అల్లిగూడెం, లంకపల్లి, గంగానమెట్ట తదితర 15 ఎంపీపీఎస్ పాఠశాలల్లో ఎస్జీటీ-15 పోస్టులు ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 16 నుంచి 21వ తేదీలోపు స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని ఎంఈఓ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
# Yadagiri










