ఆస్తుల గుట్టు రట్టు.. బినామీలకు చుట్టు.|

0
2

● హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

● రూ.4.94 లక్షల నగదు, రూ.57 లక్షల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు స్వాధీనం

● బంజారాహిల్స్‌లో ఓపెన్ ప్లాట్, రూ.20 లక్షల పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు గుర్తింపు

అల్వాల్,సెప్టెంబరు29:హైదరాబాద్ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం సోదాలు చేపట్టింది. 

ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని ఐదు చోట్ల ఏకకాలంలో ఈ ప్రక్రియ కొనసాగింది.

నిమ్స్ ఉద్యోగి ధన్‌రాజ్ నివాసంలో రూ.4,94,394 నగదు లభించింది. మహేశ్వరం పరిధిలో సుమారు రూ.57 లక్షల విలువైన మూడు వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. 

బంజారాహిల్స్ ఎమ్‌ఎల్‌ఏ కాలనీలోని వెంకటేశ్వర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఓపెన్ ప్లాట్‌కు సంబంధించిన రికార్డులను కూడా గుర్తించారు.

నిమ్స్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి డి.గణేష్ పేరు మీద ఉన్న రూ.20 లక్షల విలువైన రెండు పెట్టుబడి పత్రాలు, రూ.3 లక్షల చేతి రుణాలకు సంబంధించిన రశీదులు సైతం లభించాయి. వీటన్నింటినీ తదుపరి పరిశీలన కోసం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.

#Sidhumaroju

Alwal