Madanapalle: మదనపల్లెకు చెందిన విజయ భారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతును బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించారు.|

0
2

మదనపల్లె: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా విజయ భారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతు ఎన్నికయ్యారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం విడుదల చేసిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుల జాబితాలో అన్నమయ్య జిల్లాకు చెందిన డాక్టర్ సేతుకు స్థానం కల్పించారు.

 

అన్నమయ్య జిల్లాకు సంబంధించి డాక్టర్ మోడెం వీరాంజనేయ ప్రసాద్, డాక్టర్ ఎన్. సేతు, ఎల్లంపల్లి ప్రశాంత్‌లను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నియమించారు. మదనపల్లి నియోజక వర్గం లో అందరివాడిగా మన్ననలు పొందిన డాక్టర్ ఎన్. సేతుకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అవకాశం కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, విజయ భారతి విద్యాసంస్థల సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.