ఆసిఫాబాద్‌లో మత్స్య వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం |

0
20

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపల విక్రయాలను పెంపొందించడంతో పాటు, మత్స్య ఆహార పదార్థాల తయారీ-విక్రయాల ద్వారా ఉపాధి పొందేందుకు ప్రభుత్వం సరికొత్త అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) పథకం కింద జిల్లాకు 2 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ వాహనాలు మంజూరైనట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ వాహనాల కొనుగోలుకు ఆసక్తి కలిగిన జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ పథకం ఆర్థిక వివరాలను ఆయన వివరిస్తూ.. మంజూరైన ఒక్కో మొబైల్ వాహనం యొక్క మొత్తం విలువ రూ.10 లక్షలు ఉంటుందని, ఇందులో లబ్ధిదారులకు రూ.4 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. సబ్సిడీ మినహాయించగా మిగిలిన లబ్ధిదారుడి సొంత వాటా కింద రూ.6,65,164 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు నిర్ణీత మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)తో పాటు తమ దరఖాస్తులను ఆగష్టు 24వ తేదీ లోగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారి సాంబశివరావు సూచించారు.