డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో|

0
1

ఎమ్మిగనూరు: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మిగనూరులోని స్థానిక సుందరయ్య భవన్‌లో డివైఎఫ్ఐ నాయకులు పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు సురేష్, మండల కన్వీనర్ విజయ్, నాయకులు అజిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను గుర్తించి, వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను పకడ్బందీగా అమలు చేసి, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.