🎤భారత్ ఆవాజ్, ఆసిఫాబాద్ ఉట్నూర్:
కుమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఉట్నూర్ ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ (సమస్యల పరిష్కార వేదిక) సమయం రేపు మార్చబడింది. ఆగస్టు 24వ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (PO) మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు.రేపు ఆదివాసీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఉదయం ప్రారంభమయ్యే ఈ వేదిక, రేపు మాత్రం మధ్యాహ్నం 2 గంటలకే మొదలవుతుందని స్పష్టం చేశారు. కావున మారుమూల మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారులు ఈ సమయ మార్పును గమనించి, సహకరించాలని పీవో కోరారు.










